తెలంగాణ సచివాలయం దగ్గర హైటెన్షన్.. ముట్టడి!

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJP నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. BJP చీఫ్ రామచందర్ రావు, కొందరు MPలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో పెట్టి స్టూడెంట్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామచందర్ రావు ఫైర్ అయ్యారు. CM రేవంత్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు CM అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.



