చైర్పర్సన్ పదవి కోసం TDP నేత పెళ్లి?

మన్యం జిల్లా సాలూరులో ఓ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో TDP మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి గుళ్ల మంజీరను వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయా? లేక వ్యక్తిగత నిర్ణయమా? అన్న చర్చ స్థానికంగా మొదలైంది. అయితే పెళ్లికి, పదవికి సంబంధం ఉందనే దానిపై స్పష్టత లేదు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి?



