VMRDA ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతలు

AP: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) ఇన్‌ఛార్జి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిషనర్ నియామకం జరిగే వరకు కేతన్ గార్గ్ ఈ పదవిలో కొనసాగనున్నారు.



