← Back to news

అంబేద్కర్ కు అవమానంపై నిరాహార దీక్ష..!

By Ravi· 2d ago· Kamareddy, Kamareddy, Kamareddy
అంబేద్కర్ కు అవమానంపై నిరాహార దీక్ష..!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్ ఈ దీక్ష చేపట్టారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమార ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 'కల్పిత నాయకుడు' పుస్తక ప్రచురణ నిలిపివేయాలని, పుస్తకాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ దీక్షకు BMM జిల్లా అధ్యక్షుడు లీడర్ రవీంద్ర, అంబేద్కర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ధ్యామని భూపతి తదితరులు మద్దతు తెలిపారు.

More in Local