విదేశీ పౌరసత్వం తీసుకుంటే.. ఓటుకు గుడ్‌బై!

విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్టుతో పాటు ఓటు హక్కుకూ గుడ్‌బై చెప్పాల్సిందే! అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల పౌరసత్వం తీసుకున్న ఇండియన్స్ ఓటర్ లిస్ట్ నుంచి తమ పేరు తొలగించిన ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తోంది. SIR సందర్భంగా ఈ ఎంబసీలు వివరాలు అడుగుతున్నాయని NRIలు చెబుతున్నారు. విదేశాల నుంచే ఫారం-7తో పేరు తొలగించుకోవచ్చు. అయితే భారత పౌరసత్వం ఉన్న NRIలకు రూల్ వర్తించదు. అంటే ఫారెన్ సిటిజన్‌షిప్ తీసుకున్నవారు ఓటర్ లిస్ట్‌లో ఉండలేరు.

