← Back to news

ట్రైన్లు ఆపినా.. యువతను ఆపలేరు: చిరాగ్

By Nani Eluri· 2h ago· X
ట్రైన్లు ఆపినా.. యువతను ఆపలేరు: చిరాగ్

ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న CJP నిరసనకు వెళ్లే ట్రైన్లను క్యాన్సిల్ చేయడంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్పందించారు. “భారత యువతను ఎవరూ ఆపలేరు. ఎన్ని ట్రైన్లు ఆపుతారు? ఎంత కనెక్టివిటీని అడ్డుకుంటారు? ఎన్ని రోడ్లను బ్లాక్ చేస్తారు? భారత యువత ప్రపంచానికి దిశ చూపగలదు. గత తరాలు కూడా అదే చేశాయి” అని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై సమస్యలుంటే నిరసనలతో పాటు ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి పరిష్కరించుకోవాలని చెప్పారు.

More in National