గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవిస్తే..!

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు NTR Baby Kits అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కిట్ ధర 1,400 రూపాయల వరకు ఉంటుందనీ, ఇందులో దోమతెరతో బేబీ బెడ్, వాటర్‌ప్రూఫ్ షీట్, బేబీ క్లాత్స్, టవల్, న్యాపీలు, 100 గ్రాముల పౌడర్, 100ml షాంపూ, 200ml ఆయిల్, సబ్బు, రాటిల్ బొమ్మ, కిట్ బ్యాగ్ వంటి 14 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ కిట్ల కోసం ప్రభుత్వం సంవత్సరానికి 51 కోట్ల 15 లక్షలు కేటాయించింది.



