← Back to news

'ఈనాడు' న్యూస్‌పేపర్‌కి KTR నోటీస్

By Krishna· 6 Oct 2026· X
'ఈనాడు' న్యూస్‌పేపర్‌కి KTR నోటీస్

తన పాస్‌పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు న్యూస్‌పేపర్‌కి, తన లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించినట్లు BRS ఎమ్మెల్యే KTR తన xలో తెలిపారు. "50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక.. నిజాలను కన్ఫామ్ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం" అని రాసిన ఆయన.. సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుంచి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More in TG