భుజంపై శవం.. కిలోమీటర్ నడక
కర్నూలు కలెక్టరేట్ సమీపంలో తుంగభద్ర నదిలో దూకి కర్ణాటకకు చెందిన జయశీల (41) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ G. రంగస్వామి నదిలోకి దిగి ఆ మృతదేహాన్ని బయటకితీశారు. మోయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, మానవత్వంతో ఆ శవాన్ని తన భుజాలపై వేసుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం నడిచి గట్టుకు తీసుకువచ్చారు. మొదట గుర్తుతెలియని శవంగా భావించిన ఈ ఘటనలో, కానిస్టేబుల్ చూపిన సాహసానికి, నిస్వార్థ సేవకు జనాలు సాల్యూట్ చేస్తున్నారు.


