← Back to news

200 కోట్ల నటిగా మమితా బైజు..!

By Anusha· 2h ago· Indiatimes
200 కోట్ల నటిగా మమితా బైజు..!

మలయాళ నటి మమితా బైజు 2026లో అరుదైన ఘనత సాధించారు. ఆమె నటించిన ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ & సన్స్’, ‘బెత్లెహేం కుటుంబ యూనిట్’.. మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ఒకే సంవత్సరంలో మూడు 200 కోట్లు సాధించిన సినిమాల్లో నటించిన తొలి దక్షిణ భారత నటిగా మమితా నిలిచినట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ‘ప్రేమలు’తో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన మమితా.. ఇప్పుడు వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

More in Entertainment