విమెన్స్ కోసం 250 ‘పింక్ పార్కులు’!

ఢిల్లీలో విమెన్స్ సేఫ్టీ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని 250 వార్డుల్లో విమెన్స్ కోసం స్పెషల్ పింక్ పార్క్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పార్కుల్లోకి మహిళలు, పిల్లలకు మాత్రమే అనుమతి ఉంటుంది. పార్కుల ENTRY, EXIT ద్వారాల వద్ద విమెన్ సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. సేఫ్టీ కోసం CCTV కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. జిమ్ పరికరాలు, ప్రత్యేక వాష్ రూమ్స్ , డ్రెస్సింగ్ రూమ్స్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.


