← Back to news

KTR సొంతవారినే ఇబ్బంది పెడతారు: కవిత

By A.Ajay· 2d ago
KTR సొంతవారినే ఇబ్బంది పెడతారు: కవిత

TG: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత మనిషినైన తనను కూడా KTR ఇతరులతో తిట్టిస్తున్నారని ఆరోపించారు. సొంతవారిపై మరిగే నీళ్లు పోసినట్లుగా వ్యవహరించడం ఆయన నైజమని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడాల్సిన KTR రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్మికుల కష్టాలు ఆయనకు తెలియవని అన్నారు. తమ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

More in TG