ECINet యాప్‌పై శశి థరూర్ సీరియస్.. క్యాన్సిల్ చేయాలి!

కాంగ్రెస్ MP శశి థరూర్ ECINet యాప్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఓటర్ లిస్ట్ రివిజన్‌లో వాడుతున్న ఈ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే క్యాన్సిల్ చేయాలని ఎన్నికల సంఘాన్ని (ECI) కోరారు. ECINet కంట్రోల్ ఢిల్లీలోనే సెంట్రలైజ్ అవడంతో రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారుల పాత్ర తగ్గిపోతోందని ఆయన అన్నారు. గోవాలో 97 మంది ఓటర్ల విషయంలో ఎదురైన సమస్యలను కూడా థరూర్ చెప్పుకొచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై ఎన్నికల కమిషనర్లలోనూ ఆబ్జెక్షన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు.


