శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...

కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నవరంలో జరిగిన దళిత ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంలో హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం కాకినాడ కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హాస్టల్ మూసివేతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యా హక్కుతో ముడిపడిన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. సోమవారం దళిత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని తంతటి కిరణ్, మధుబాబు ప్రకటించారు.




