పెళ్లి చేయడం లేదని.. తండ్రిని చంపిన కొడుకు

చండీగఢ్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ను అతని 18 ఏళ్ల కొడుకు కాల్చి చంపాడు. నితిన్ సింగ్ కుమారుడు అర్మాన్‌కి 18 ఏళ్లు. తన ప్రియురాలిని వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉందని తండ్రిపై అతను ఒత్తిడి తెచ్చాడు. “నీకు 21 ఏళ్లు నిండే వరకు ఆగు” అని తండ్రి చెప్పాడు. అర్మాన్ వినకుండా తండ్రితో గొడవపడ్డాడు. పిస్టల్ తీసుకొని తండ్రిని కాల్చి చంపాడు. పోలీసులు అర్మాన్‌ను అరెస్టు చేశారు. గతంలో కారు నడుపుతూ ఇద్దర్ని ఢీకొట్టి చంపిన కేసులో బెయిల్‌పై బయట ఉన్నాడు.

