'ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

శ్రీకాకుళం జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ తదితర స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్నికల సన్నద్ధత పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.



