← Back to news

ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

By RAMESH· 22 Aug 2026· Rebbana

TG : ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఆటో డ్రైవర్ల సమ్మెను సక్సెస్ చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఆటో డ్రైవర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని చెప్పారు. ఆటోలకు రేడియం స్టిక్కర్ మినహాయింపు, మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Ola, Uber, Rapido బైక్ టాక్సీలను బ్యాన్ చేసి ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, రూ. 12,000 సాయం అందించాలని కోరారు.

More in Local