రేపు ఈ ప్రాంతాల్లో కరెంటు కట్!

జగిత్యాల టౌన్-3 సెక్షన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, మరమ్మతుల పనుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 11 కేవీ డైరీ ఫీడర్పై పనులు చేపట్టనున్న నేపథ్యంలో భవానీనగర్, శాంతినగర్, అయ్యప్ప గుడి, కరీంనగర్ రోడ్, నర్సింగాపూర్ రోడ్తో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.



