ఈత సరదా.. ప్రాణాల మీదకు తెచ్చింది!

దసరా సెలవుల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందాడు. నల్గొండకు చెందిన ఎండీ అహ్మద్ అలీఖాన్ (38) సౌదీ అరేబియాలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం భార్యాపిల్లలతో కలిసి కనగల్ చెరువును సందర్శించాడు. ఈత కొట్టేందుకు నీటిలో దిగిన ఆయనకు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. సమీప రైతులు బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


