గ్రామీణులకు లయన్స్ క్లబ్ ఉచిత వైద్య సేవలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఉటూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, రామగుండం సంయుక్తంగా ఉచిత వైద్య, నేత్ర వైద్య శిబిరం నిర్వహించాయి. లయన్స్ ఇంటర్నేషనల్ విజన్ వీక్ ఆఫ్ సర్వీస్లో భాగంగా అక్టోబర్ 8 నుంచి 18 వరకు చేపడుతున్న సేవల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. గ్రామస్థులకు ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించి వైద్యుల సలహాలు అందించారు.



