కేజ్రీ కొత్త బంగ్లా శీష్ మహల్- 2 ః బిజేపి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన కొత్త బంగళాను బీజేపీ 'శీష్ మహల్ 2'గా అభివర్ణించింది. ఈ బంగ్లా కో సం భారీగా ఖర్చు చేశారని, విలాసవంతమైన సౌకర్యాల కోసం ప్రైవేట్ డబ్బును ఉపయోగించారని బీజేపీ నేత పర్వేష్ వర్మ ఆరోపిస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. అయితే, అవి నకిలీవని, వాటిని 'పింటరెస్ట్' నుండి డౌన్లోడ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టిగా బదులిచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆప్ మండిపడింది.


