టీబీ స్క్రీనింగ్ క్యాంప్

టీబీ ముక్త్ భారత్ మిషన్‌లో భాగంగా KHPT NGO ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పాండురంగ నగర్ బస్తీ దావఖానాలో చెస్ట్ ఎక్స్-రే క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 120కి పైగా ఎక్స్-రేలు, కఫం పరీక్షలు చేయగా 2 ఎక్స్-రే పాజిటివ్ కేసులు గుర్తించారు. డాక్టర్ స్వాతి, STLS రహీం, STS అర్చన, TBH మధుబాబు, ఆశా వర్కర్లు, మెడికల్ స్టాఫ్ పాల్గొని ఈ క్యాంప్‌ను సక్సెస్ చేశారు.




