నియంత కిమ్‌లా ప్రధాని మోదీ: రేవంత్ రెడ్డి

TG: కుదిరితే ఓటు చోరీ.. కాకపోతే సీటు చోరీ అన్నట్లు BJP వ్యవహరిస్తోందని CM రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అదే చేశారని ఆరోపించారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో పలు అంశాలపై సీఎం స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ పైన ఎలాంటి క్రిమినల్ కేసు లేకపోయినా ఉన్నట్లు చూపించి ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమన్నారు. ప్రధాని మోదీ, ఉత్తరకొరియా నియంత కిమ్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు.


