← Back to news

కేశవాపురంలో రెండు భవనాలు.. నిధులు మంజూరు

By Chippa Naga· 8h ago· Warangal
కేశవాపురంలో రెండు భవనాలు.. నిధులు మంజూరు

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపురం గ్రామంలో మహిళా సంఘం, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ₹.30 లక్షలు మంజూరు చేసినట్లు నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తెలిపారు. మహిళా సంఘాల భవనానికి ₹.10 లక్షలు, గ్రామపంచాయతీ భవనానికి ₹.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లో మౌలికవసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

More in Local