బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఓటమి: అఖిలేష్ యాదవ్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శాంతియుత ప్రదర్శనలను నిషేధించడం బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఓటమి అని సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. పాలకులు ఉన్న ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజల కోసం లోక్‌కల్యాణ్ మార్గ్‌లోనే ఒక ప్రదేశం కేటాయిస్తే మంచిదని సూచించారు. అలా చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని అన్నారు.


