కాలుష్య పంజా.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై ఆందోళన

Centre for Financial Accountability రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వస్తున్న విషపూరితమైన కెమికల్ ‘లీచెట్’ స్థానిక భూగర్భ జలాలు, చెరువులను తీవ్రంగా కలుషితం చేస్తోంది. అంతరిక్షం నుంచి NASA JPL, Carbon Mapper ఉపగ్రహాలు గుర్తించే స్థాయిలో ఇక్కడి ఉద్గారాలు ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఈ కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వస్తున్నాయి.


