పాఠశాలకు ప్రింటర్.. పూర్వ విద్యార్థుల విరాళం

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్ విరాళంగా అందించారు. పాఠశాలకు ప్రింటర్ అవసరమని హెడ్‌మాస్టర్ తెలపడంతో అక్కడే చదువుకున్న నస్రీన్ (ఎస్ఐ), ఎండి సయ్యద్ పాషా (పిసి), ఎండి ఖాజా (ఎస్జీటీ) స్పందించారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ సమక్షంలో ప్రింటర్ అందజేశారు. పాఠశాల తరఫున వారికి సన్మానం చేశారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారిని గ్రామస్తులు అభినందించారు.



