జనసేన కార్యకర్త మృతి.. ఫ్యామిలీకి రూ.2 లక్షల సాయం
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా బెండమూర్లంకకు చెందిన జనసేన కార్యకర్త రోళ్ల ప్రేమ్ కుమార్ మృతిపై జనసేన నేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో ప్రేమ్ కుమార్ చనిపోవడం విషాదకరమన్నారు. ప్రేమ్ కుమార్ ఫ్యామిలీతో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రొడ్యూసర్ S.K.N. 2 లక్షల రూపాయల సాయం అందించారు. జనసేన పార్టీ ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని నాగబాబు భరోసా ఇచ్చారు.


