← Back to news

చవితి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

By DK· 1d ago
చవితి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

TG: వినాయక చవితి సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రజలకు ఎస్పీ జి. జానకి షర్మిల పండగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో సోదరభావంతో నిర్వహించాలని సూచించారు. ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

More in Local