మంత్రి చేతుల మీదుగా గిరి ప్రదక్షిణ ప్రారంభం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలోని దుర్గా నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా సందర్భంగా శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి, మట్టా దయానంద్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం జరగగా, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.



