నీట్ ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు: బండి సంజయ్

TG: దిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక శక్తులున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పరిస్థితులను నీట్ సమస్యకు సంబంధం లేని ఆర్టికల్ 370, కాశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు సంబంధించిన నినాదాలు వినిపించడం ఆందోళనకరమన్నారు. శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.



