← Back to news

బైక్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి!

By Jagadish· 19h ago
బైక్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి!

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచర్ల మండలం నరసరావుపేటలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళ్తున్న బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. చెక్ పోస్ట్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలు తేలాల్సి ఉంది.

More in Local