బోగస్ ‘ఫారం-7’ కలకలం.. ఓట్ల తొలగింపునకు కుట్ర?

TG: SIR డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌పై కంప్లైంట్స్, అబ్జెక్షన్స్‌లకు నేడు చివరి రోజు. పాతబస్తీలో బోగస్ ‘ఫారం-7’ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒక వర్గం ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించేందుకు కొందరు ప్రీ-ప్రింటెడ్ ఫారం-7లు సిద్ధం చేసినట్లు సమాచారం. బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలో 50 వేల నుంచి 70 వేల వరకు ఫారం-7లు అందినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఫారం-7లు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.