← Back to news

గణేశ్ వేడుకల్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

By Krishna· 7h ago· X

గణేశ చతుర్థి సందర్భంగా నిన్న సల్మాన్ ఖాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన బ్రదర్ సోహైల్ ఖాన్ ఇంటికి వెళ్లి హారతి సమయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్లూ స్ట్రిప్స్ షర్ట్, జీన్స్‌, తలపై తెల్లని స్కార్ఫ్ కట్టుకుని కనిపించారు. ఇంతకు ముందు ఆయన తల్లి సల్మా ఖాన్, సోదరి అర్పితా ఖాన్ శర్మ కూడా గణేశుడిని స్వాగతించారు. అదనంగా అంబానీల అంటిలియా వేడుకలకు కూడా సల్మాన్ హాజరయ్యారు. ఇలా ఏటా సల్మాన్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటూ.. అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు.

More in Entertainment