అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన

ఉపాసన కామినేని కొణిదెలకు అపోలో హాస్పిటల్స్‌లో కీలక బాధ్యతలు దక్కాయి. ఆమెను ప్రాజెక్ట్స్ విభాగం డైరెక్టర్‌గా నియమించారు. దేశవ్యాప్తంగా కొత్త హాస్పిటల్స్‌ల నిర్మాణం, ఉన్నవాటి విస్తరణ, ఆధునీకరణను ఆమె చూసుకుంటారు. అపోలో 8,600 కోట్ల రూపాయల విస్తరణకు సిద్ధమవుతున్న వేళ ఈ నియామకం జరిగింది. తన తాత, అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్.సి.రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన బాధ్యతని ఉపాసన తెలిపారు.



