Jio యూజర్లకు Canva గిఫ్ట్..ఏడాది పాటు ఫ్రీ

349, 399 రూపాయలతో JIO రీఛార్జ్ చేసుకునేవారికి Canva సర్వీసులను 12 నెలల పాటు ఫ్రీగా అందనుంది. 349 ప్లాన్‌తో Canva Pro Lite,399 ప్లాన్‌తో Canva Pro పొందొచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత ‘MyJio’ App ద్వారా ఈ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. Canva Pro Liteలో ప్రీమియం టెంప్లేట్స్, బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, 50 GB క్లౌడ్ స్టోరేజ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. Canva Proలో AI టూల్స్, అడ్వాన్స్‌డ్ బ్రాండ్ కిట్స్, 100GB స్టోరేజ్‌తోపాటు మరిన్ని ఫీచర్లు దొరుకుతాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చింది.



