AI చాట్‌బాట్ల వైపు యువత చూపు.. నిపుణుల హెచ్చరిక

ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం లాంటి సమస్యలను చెప్పుకునేందుకు యువతలో చాలామంది ఇప్పుడు AI చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడైనా అందుబాటులో ఉండటం, జడ్డ్ చేయకుండా రియాక్ట్ అవ్వడం ఇందుకు కారణం. అయితే AIని కౌన్సెలర్‌కు ప్రత్యామ్నాయంగా భావించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తి భావోద్వేగాలు, పరిస్థితులను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని చెబుతున్నారు. తీవ్రమైన సంక్షోభ సమయంలో AI మానవ సహాయం అందించలేదంటున్నారు. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలంటున్నారు.



