మనసులో మాటలకు సౌండ్ ఎలా?

మనలో మనం మాట్లాడుకోవడం చాలా కామన్. ఇలా బయటికి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా మనసులో మాత్రం మాటలు వినిపిస్తుంటాయి. దీన్నే ‘Inner Speech’ అంటారు. సైంటిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే.. మనసులో ఒక మాట అనుకున్నప్పుడు, ఆ మాటను నోరు ఎలా పలుకుతుందో మెదడు ముందే ఊహించుకుంటుందట. ఆ తర్వాత ఆ మాట ఎలా వినిపిస్తుందో కూడా మెదడు అంచనా వేస్తుందట. అంటే మనసులో మాట్లాడుకోవడం కేవలం ఆలోచించడం మాత్రమే కాదు.. మెదడు నిజంగానే మాట్లాడుతున్నట్టుగా దాన్ని సిమ్యులేట్ చేస్తుందన్నమాట!



