TDP రెడ్ బుక్, YCP రప్పా రప్పా.. విజయసాయి షాకింగ్ కామెంట్స్

AP: రాష్ట్రంలో 15 ఏళ్లుగా TDP, YSRCP చుట్టూనే పాలిటిక్స్ తిరుగుతున్నాయని మాజీ MP విజయసాయిరెడ్డి మీడియాతో అన్నారు. ఈ రెండు పార్టీలు ఫ్యాక్షన్ పార్టీలుగా మారిపోయాయని కామెంట్ చేశారు. టీడీపీ రెడ్ బుక్ పార్టీగా మారితే.. వైసీపీ రప్పా రప్పా పార్టీగా మారిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారని, రాష్ట్ర డెవలప్‌మెంట్‌కు బ్రేక్ పడుతోందన్నారు. పోలీసులు అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని చెప్పారు.


