← Back to news

ఏటీఎంలో వాకీటాకీతో కొత్త రకం స్కామ్!

By Lokesh· 1d ago
ఏటీఎంలో వాకీటాకీతో కొత్త రకం స్కామ్!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లో సెప్టెంబర్ 14న సమీరా ముషార్రఫ్ ఖాన్ ATMకు వెళ్లారు. కార్డు ATMలో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి వాకీటాకీ ద్వారా మాట్లాడి, సీసీ టీవీలో చూస్తున్నానని నమ్మించాడు. తర్వాత పిన్ నంబర్ ఎంటర్ చేయమని చెప్పి డబ్బులు దోచేశాడు. పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు థానేకి చెందిన జితేంద్ర రామ్‌దేవ్ పాల్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 2.6 లక్షల రూపాయలు, వాకీటాకీని రికవర్ చేశారు. ATMకి వెళ్లినప్పుడు జాగ్రత్త!

More in National