సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన

సింగరేణి కార్మికుల ఆందోళనలకు యాజమాన్యం, ప్రభుత్వం స్పందించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు 34శాతం వాటా చెల్లించనున్నట్లు ప్రకటించాయి. వాస్తవ లాభాలను ప్రకటించి 40శాతం వాటా ఇవ్వాలని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లాభాల వాటాను ప్రకటించారు.


