గణపతి నవరాత్రుల్లో కాంగ్రెస్ నేతలు..!

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నేతలు చీటి సత్యం రావు–జ్యోతి పాల్గొన్నారు. వారు గణనాధుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

