మహారాష్ట్రలో కరువు.. విద్యార్థుల ఆకలి తీరుస్తున్న టీచర్లు

మహారాష్ట్రలో కరువు తాండవం చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నెలలుగా టీచర్లు, హెడ్‌మాస్టర్లు తమ సొంత డబ్బుతో మిడ్-డే మీల్స్ నడుపుతున్నారు. కేంద్రం నిర్వహించే పీఎం పోషణ్ నిధులు ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 70 శాతం ప్రాంతాల్లో కరువు ఉండటంతో వ్యవసాయ ఆదాయాలు తగ్గిపోయాయి. దీంతో పాఠశాల భోజనమే విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. దీంతో ఖర్చు భరిస్తూ టీచర్లు ఈ పథకం కొనసాగిస్తున్నారు. వంటవారికి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.



