← Back to news

ఓ అబ్బ!.. కేపీ కిల్లి పాటకు ఘన ప్రారంభం..!

By Srisailam· 3d ago
ఓ అబ్బ!..  కేపీ కిల్లి పాటకు ఘన ప్రారంభం..!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సీనియర్ జర్నలిస్ట్ కేపీ (ఖాజా పాషా) నటించిన 'ఓ అబ్బ వేసుకున్న కిల్లి' పాట ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. పాత జాతీయ రహదారిపై ఉన్న మొబైల్ అడ్డా షాపులో జరిగిన ఈ ఈవెంట్‌కు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి, శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పాటను లాంచ్ చేశారు. ఆనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని నేటి తరానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.కష్టాలను ఎదుర్కొంటూ జర్నలిజంలో మంచి పేరు సంపాదించిన కేపీ.. ఇప్పుడు కళారంగంలోనూ అడుగుపెట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.