← Back to news

సొంత ఖర్చులతో మట్టి గణపతులు.. తొమ్మిదేళ్లుగా సేవ

By Md Jabeer· 1d ago
సొంత ఖర్చులతో మట్టి గణపతులు.. తొమ్మిదేళ్లుగా సేవ

TG: పర్యావరణ పరిరక్షణ కోసం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రానికి చెందిన దుప్పెన గణేష్ తొమ్మిదేళ్లుగా మట్టి గణపతులను స్వయంగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులు కలుషితం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వినాయక చవితికి మట్టి గణపతులను తయారు చేసి ప్రజలకు అందజేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.

More in Local