శివాలయంలో బాలికపై లైంగిక దాడికి యత్నం
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వడ్ పరిధి నిగ్డీలో ఉన్న శివాలయంలో అక్టోబర్ 11న మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. పూజ కోసం ఆలయానికి వచ్చిన బాలికపై, అక్కడ మెట్రో నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు.. దాడికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఆలయంలోని CCTVలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. బాలికలకు ఆలయాల్లో కూడా భద్రతలేకుండా పోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.



