← Back to news

తయారీ రంగానికి రుణభారం తగ్గించాలి

By A.Ajay· 2h ago
తయారీ రంగానికి రుణభారం తగ్గించాలి

దేశంలో ఉద్యోగాలు పెరగాలంటే తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ అన్నారు. బ్యాంకులు ప్రభుత్వ బాండ్లలో పెట్టాల్సిన డబ్బు పరిమాణాన్ని సూచించే SLR ప్రస్తుతం 18 శాతంగా ఉందని, దాన్ని తగ్గిస్తే పరిశ్రమలకు రుణాలు అందుబాటులోకి రావచ్చని చెప్పారు. భూమి సేకరణను సులభతరం చేయాలని, పరిశ్రమలకు విద్యుత్ ఖర్చు తగ్గించాలని సూచించారు. PLI పథకం తాత్కాలికంగా ఉపయోగపడుతుందని, దీర్ఘకాలంలో మరిన్ని మార్పులు అవసరమని అన్నారు.

More in National