మొదటి రేబిస్ ఫ్రీ కంట్రీ?

కుక్కల వల్ల వచ్చే మానవ రేబిస్‌ను అంతం చేసిన ఫస్ట్ సౌత్ ఏసియన్ కంట్రీగా భూటాన్‌ని ప్రకటించింది WHO. 2023 జూన్ నుంచి ఇక్కడ ఒక్క రేబిస్ మరణం కూడా లేదు. కింగ్ ఆదేశంతో అక్కడ దేశవ్యాప్తంగా కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ చేశారు. కుక్క కాటుకు ఉచితంగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు కూడా భూటాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని WHO కోరింది. NCDC రిపోర్టుల ప్రకారం ఇండియాలో రోజూ దాదాపు 13వేల కుక్కకాటు ఘటనలు జరుగుతున్నాయి.


