హైదరాబాద్‌లో కునాల్ కమ్రా షో.. అడ్డుకునేందుకు యత్నం!
TG: హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షోను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈరోజు సికింద్రాబాద్‌లోని TGRTC కళాభవన్‌లో ‘స్టాండింగ్ అప్’ షో జరుగుతుండగా, 10–15 మందితో వచ్చిన బస్సు అక్కడికి చేరుకుంది. రాముడు, సీతపై కమ్రా చేసిన కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బజరంగ్ దళ్ ఆ షోను ఆపాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అన్‌వాంటెడ్ ఇన్సిడెంట్ జరగలేదు.



