తుఫాన్ అలర్ట్

AP: ఎల్‌నినో బలంగా ఉండటంతో బంగాళాఖాతం వేడెక్కుతోంది. ఈ కారణంగా ఈ నెల 22న అండమాన్ సముద్రంలో ఆవర్తనం ఏర్పడబోతోంది. ఇది 24కి అల్పపీడనంగా, 26 తర్వాత వాయుగుండంగా, 29న తుఫానుగా మారి.. 30న ఉత్తర కోస్తాలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని వల్ల ఉత్తరకోస్తా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈశాన్య రుతుపవనాలు కూడా తేమను పెంచి, వర్షాలు కురిసే అవకాశాలను పెంచబోతున్నాయి.

